సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఒకనాడు.. గమ్యం, వేదం, కృష్ణం వందే జగద్గురుమ్, కంచె, శాతకర్ణి, హిందీ గబ్బర్ సింగ్ వంటి వరుస హిట్స్ సాధించిన క్రిష్ జాగర్లమూడి ఇటీవల వరుస ప్లాఫ్ లతో బాడ్ టైం లో ఉన్నపటికీ యూవీ క్రియేషన్ బ్యానర్ ఫై సీనియర్ హీరోయిన్ అనుష్క శెట్టి కీలక పాత్రలో జగపతిబాబు, విక్రమ్ ప్రభు, నటించిన చిత్రం ఘాటి. సినిమా నేడు, శుక్రవారం ఒక మోస్తరు అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం తెలుగుతో పాటు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లోనూ రిలీజ్ అయింది. ఇప్పటికే పలు చోట్ల షోలు పడ్డాయి. ఈ సినిమా చుసిన ప్రేక్షకుల రిపోర్ట్ ప్రకారం.. పుష్ప సినిమా ఎర్ర చందనం స్మగ్లింగ్ తరహా ఆంధ్ర ఒరిస్సా సరిహద్దులలో గంజాయి మత్తు పదార్ధాల స్మగ్లింగ్ ముఠాల మధ్య కధనంతో నిర్మించారని ఫాస్టాఫ్ అదిరిపోయిందని అంటున్నారు.సెకండ్ హాఫ్ సాధారణంగానే ఉందని ముఖ్యంగా యాక్షన్ సీన్లలో అనుష్క బాగా చేసినప్పటికీ వయస్సు పై బడిన ఛాయలు కనపడుతున్నాయని, ఇటీవల చాలాకాలానికి జగపతి బాబు ని పూర్తిగా వాడుకున్నారని . బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుందని చెబుతున్నారు. ఇక ప్రీ క్లైమాక్స్ ఓ రేంజ్‌లో ఉందని కామెంట్లు చేస్తున్నారు. ఈ చిత్రంతో క్రిష్ మంచి దర్శక ప్రతిభ చూపించారని అంటున్నారు.
