సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత, భగవద్గీత ఫౌండేషన్ వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ డాక్టర్ ఎల్వి గంగాధర శాస్త్రి భగవద్గీత ప్రచారంలో ఆయన చేస్తున్న కృషి అద్వితీయమని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామ కృష్ణంరాజు, pac చైర్మెన్,భీమవరం ఎమ్మెల్యే అంజిబాబు, టిటిడి బోర్డు మాజీ అధ్యక్షులు కనుమూరి బాపిరాజులు ఆయనను గత రాత్రి ఘనంగా సన్మానించారు. భీమవరం ఎస్ఆర్ కేర్ ఇంజనీరింగ్ కళాశాలలో డా గంగాధర్ శాస్త్రి భగవద్గీత సారాంశాన్ని సామాన్యుడి కూడా విని పరవశించి పోయేలా ప్రసంగం చేసిన తీరు గంగాధర్ శాస్త్రి సేవలు భావితరాలకు ఆదర్శనీయమని ప్రశంసించారు. క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ కనకరాజు సూరి, కళాశాల ఉపాధ్యక్షులు ఎస్వీ నాగరాజు, డైరెక్టర్ డా జగపతి రాజు, ప్రిన్సిపల్ డా కెవి మురళీ కృష్ణంరాజు, చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ సిహెచ్ దిలీప్ చక్రవర్తి, ఆనంద ఫౌండేషన్ ఉద్దరాజు విశ్వనాథరాజు, జనసేన జిల్లా అధ్యక్షులు కొటికలపూడి చినబాబు తోపాటు ఉండి, భీమవరం ప్రాంతాలకు చెందిన పలువురు ప్రముఖులు ఆధ్యాత్మిక వేత్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *