సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: వైసీపీ అధినేత వై.యస్. జగన్ ఆదేశాల మేరకు వైసీపీ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న ‘రైతన్నకు బాసట‘ నిరసన కార్యక్రమం లో భాగంగా భీమవరం పట్టణంలో వైయస్సార్ సీపీ ఆధ్వర్యంలో MLC కౌరు శ్రీనివాస్ మరియు వైసీపీ పార్టీ ఇంచార్జి చినమిల్లి వెంకట రాయుడు, ఉండి ఇంచార్జి పివిఎల్ నరసింహరాజు, తదితరుల నేతృత్వంలోభీమవరం నియోజకవర్గం ,వైసీపీ శ్రేణులు ర్యాలీ మరియు ధర్నా చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్లిప్తత వల్ల రైతులు ఎరువులు దొరక్క ఇబ్బందులు పడుతున్నారని , రాష్ట్రంలో ఎరువుల బ్లాక్ మార్కెట్ అరికట్టాలని, సార్వా పంటకు కావలసిన యూరియా సహా రైతులుకు అవసరమైన ఎరువులును వెంటనే పంపణీ చేయాలని, ఎరువులు పక్కదోవ పట్టిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలి…పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలి…ఉచిత పంటల భీమాను పునరుదించి అందరకి వర్తింపజేయాలి… గోవాడ షుగర్ ఫ్యాక్టరీ చెరకు రైతుల బకాయిలు చెల్లించాలి… కార్మికుల వేతనాలు చెల్లించడంతో పాటు, కార్మికుల భవిష్యత్తు కు గ్యారంటీ ఇవ్వాలి…అంటూ వారు నినాదాలు చేసుకొంటూ ఆయా డిమాండ్ లతో స్థానిక RDO గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగినది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *