సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ వచ్చే శుక్రవారం నిర్వహించనున్న యాత్రను విజయవంతం చేయాలని బిజెపి పశ్చిమగోదావరి జిల్లా శ్రేణులు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏర్పాట్ల పైన భీమవరంలో జిల్లా బిజెపి కార్యాలయంలో బిజెపి నాయకులు చర్చించారు. షెడ్యూలు ప్రకారం వచ్చే శుక్రవారం ఉదయం 7.45 గంటలకు డిఎన్ఆర్ గ్రౌండ్ వద్ద చాయ్ పే చర్చ కార్యక్రమం, ఉదయం 9.30 గంటలకు స్వాతంత్ర సమరయోధులు అల్లూరి సీతారామరాజు విగ్రహానికి పూలమాల వేసే కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ పాల్గొంటారు. అదే రోజు ఉదయం 10 గంటలకు మున్సిపల్ కార్యాలయం వద్ద నుండి వెంకట్రామ థియేటర్ రోడ్డు, ప్రకాశం చౌక్, నటరాజ్ థియేటర్ మీదుగా ఆనంద ఇన్ ఫంక్షన్ హాల్ వరకు బిజెపి రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ ఆధ్వర్యంలో జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చే బిజెపి కార్యకర్తలు, నాయకులతో పాదయాత్రగా భారీ శోభాయాత్ర నిర్వహిస్తారు. అనంతరం ఆనంద ఫంక్షన్ హాల్లో ఉదయం 11 గంటలకు జరిగే భారతీయ జనతా పార్టీ విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ పాల్గొని కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.
