సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: దేశంలో ఆదాయపన్ను రిటర్న్ ఫైలింగ్ చెయ్యడానికి గడువు (Income Tax Return Due Date) సమీపిస్తోంది. అయితే ఇంకా లక్షలాది మంది పన్ను చెల్లింపుదారులు ఇప్పటికీ తమ రిటర్న్‌లను సమర్పించలేదు. ఇంకా టైమ్ ఉంది, గడువు పొడిగించొచ్చనే ఆశలతో ఉన్నారు. కానీ పొడిగింపు గురించి ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఫైనాన్షియల్ ఇయర్ 2024-25కి సంబంధించిన ఐటీఆర్‌లను ఈ సెప్టెంబర్ 15, 2025లోపు ఫైల్ చేయాల్సి ఉంటుంది.
