సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్:భీమవరం నియోజకవర్గం టీడీపీ ఇంచార్జ్ తోట సీతారామలక్ష్మి పుట్టిన రోజు వేడుకలను నేడు, శుక్రవారం వారి నివాసంలో నిర్వహించారు. భీమవరం నియోజకవర్గ ఎన్డీఏ కూటమి నాయకుల సమక్షంలో టిడిపి నియోజకవర్గ కార్యాలయంలో సీతారామలక్ష్మి పుట్టినరోజు కేకును కట్ చేశారు.టీడీపీ రాష్ట్ర కోశాధికారి మెంటే పార్ధ సారధి, టీడీపీ జిల్లా అడ్జక్షుడు మంతెన రామరాజు, స్థానిక ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసి నిండు నూరేళ్లు అష్టైశ్వర్య ఆరోగ్యాలతో మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలన్నారు. సీతారామలక్ష్మి అంకుతటిత దీక్షతో పని చేస్తారని, వారి సేవలను గుర్తించి టిడిపి అధినేత చంద్రబాబు రాజ్యసభ సభ్యురాలుగా, ఉమ్మడి జిల్లా పార్టీ అధ్యక్షురాలు, భీమవరం నియోజకవర్గ ఇన్చార్జిగా పోలిట్ బ్యూరో సభ్యురాలుగా అనేక పదవి బాధ్యతలు అప్పగించి వారికి తగిన గుర్తింపును ఇచ్చారని, భవిష్యత్తులో వారు మరిన్ని ఉన్నత పదవులకు చేరుకోవాలన్నారు. కూటమి నాయకులు కార్యకర్తలు అభిమానులు వీర మహిళలు తెలుగు మహిళలు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *