సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ప్రస్తుతం టాలీవుడ్ లోనే కాదు పుష్ప సిరీస్ హిట్స్ తో పాన్ ఇండియా స్థాయిలో 2000 కోట్లు సినిమా తీసిన టాప్ సినిమా ప్రొడక్షన్ కంపెనీలలో మైత్రీ మూవీ మేకర్స్ గ్రాండ్ గా నిలచింది. ఈ సంస్థ.పెద్ద సినిమాలు మాత్రమే కాదు చిన్న సినిమాల విషయంలో కూడా తగ్గే ప్రసక్తే లేదు అనేలా సినిమాలు చేస్తోంది. అయితే, వరుస డబుల్ హ్యాట్రిక్ పరాజయాలు తో హడలు ఎత్తిస్తున్న హీరో దర్శకుల కాంబినేషన్ లో సినిమాకు సిద్ధం అవుతున్నారు. ఆ కాంబో మరేదో కాదు నితిన్, శ్రీను వైట్ల. .మైత్రీ మూవీ మేకర్స్ ఇటీవల నితిన్ తో రాబిన్ హుడ్ సినిమా చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. మరి, అలాంటి ప్లాప్ స్టార్స్ తో సినిమా ఎలా ప్లాన్ చేస్తున్నారు? అసలు ఏంటి మీ ధైర్యం అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా ఈ ప్రాజెక్టు తో నితిన్, శ్రీను వైట్లకు మంచి హిట్ పడాలని కోరుకుంటున్నారు.
