సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: వయస్సు పెరిగే కొలది యూత్ లో కూడా క్రేజ్ పెంచుకొంటూ పోతున్న నందమూరి బాలకృష్ణ (Balakrishna) వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. హ్యాట్రిక్ హిట్ సినిమాల తర్వాత, ఆక్టోబర్ లో అఖండ 2 సినిమా రిలీజ్ కానుంది. ఇక బాలయ్య ప్రస్తుతం మూడు సినిమాలపై దృష్టి పెట్టారు. అందులో ఒకటి వీరసింహ రెడ్డి వంటి మాస్ హిట్ ఇచ్చిన గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కనున్న కొత్త చిత్రం. ప్రస్తుతం ఈ సినిమా ‘NBK 111’ అనే వర్కింగ్ టైటిల్‌తో ప్రీ-ప్రొడక్షన్ స్టేజ్‌లో ఉంది. వెంకట సతీశ్ కిలారు ఈ సినిమాను నిర్మించనున్నారు. ఇది ఎపిక్ యాక్షన్ స్టోరీగా ఉండనుంది. బాలయ్య ఇందులో ఇప్పటివరకు చూడనటువంటి ఒక శక్తివంతమైన పాత్రలో కనిపించనున్నారని మేకర్స్ చెబుతున్నారు. ఈ సినిమా దసరా పండగ సందర్భంగా లాంచ్ చేయాలనే ప్లాన్ చేస్తున్నారు. దీనితో పాటు బాలయ్య తనకు 100 వ సినిమాగా శాతకర్ణి లాంటి బంపర్ హిట్ ఇచ్చిన క్రిష్ జాగర్లమూడి తో మరో ప్రాజెక్ట్‌ను కూడా సిద్ధం చేసుకుంటున్నారు. దీన్ని కూడా విజయదశమి రోజునే షూటింగ్ ప్రారంభిస్తారని ఇండస్ట్రీ టాక్.. ఇది ఫాంటసీ చిత్రంగా రానుంది.
