సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలుగునాట పవిత్ర పంచారామ క్షేత్రాలలో అత్యంత మహిమానీనత, అమావాస్యకు పౌర్ణమి కి రంగులు మారే స్వయం భూ సోమేశ్వర లింగంగా ప్రసిద్ధి పొందిన భీమవరం గునుపూడి లోని శ్రీ సోమేశ్వర స్వామి దేవాలయంలో నేడు, శనివారం ఉదయం సూర్య భగవానుని కిరణాలు గర్భాలయంలోని శ్రీ స్వామివారి లింగాన్ని తాకడం జరిగింది. చాల అరుదుగా జరిగే ఈ సన్నివేశాన్ని చూసి భక్తులు పరవశించి పోయారు.. అలాగే ఇదే ఆలయంలో ఉప ఆలయంగా శ్రీ సూర్య భగవాన్ ఆలయం లో శ్రీ స్వామివారు దేశంలో అరుదుగా కనపడే ఎర్ర రాయి తో ప్రతిష్టాపన కావడం గమనార్హం..
