సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మ అమ్మవారిని నేడు, శనివారం దర్శించుకున్న స్థానిక భక్తులు, ఎం వెంకట గోపాల సత్యనారాయణ శర్మ కుటుంబ సభ్యులు శ్రీ అమ్మవారి దేవాలయంలో భక్తులకు నిత్యం జరిగే అన్నసమారాధన ట్రస్ట్ కు కానుకగా 1 లక్ష రూపాయలు మరియు వారి సంస్ద శ్రీఖర ఇంజినీరింగ్ సర్వీసెస్ భీమవరం పేరుమీద శ్రీ అమ్మవారి ఆలయ అభివృద్ధి పనులకు మరో 1లక్ష రూపాయలు అందించారు. వీరికి ఆలయ ఉప ప్రధాన అర్చకులు కొప్పేశ్వరరావు పూజలు ఆశీర్వచనాలు నిర్వహించగా, .ఆలయ సహాయ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ వారికీ ప్రసాదాలు శేషవస్త్రం ఫోటో అందజెయ్యడం జరిగింది.
