సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కోశాధికారి మెంటే పార్థసారథి పుట్టినరోజును పురస్కరించుకొని నేడు, శనివారం నుండి భీమవరంలోని వారి స్వగృహం వద్ద భీమవరం నియోజకవర్గ ఎన్డీఏ కుటమి పార్టీ నాయకుల ఆధ్వర్యంలో పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ.. యుక్త వయసు నుండి రాజకీయాలలో.. ఎవరికి ఏకష్టం వచ్చినా తానున్నానంటూ కార్యకర్తలకు అండగా నిలబడే మొదటి వ్యక్తి మెంటే పార్థసారథి అని, కార్యకర్తలకు ఆయనొక ధైర్యమని అన్నారు. మెంటే పార్థసారథి అంచలు అంచలుగా రాష్ట్ర నాయకునిగా ఎదిగారని ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నత పదవులను పొందాలని ఆకాంక్షించారు. టిడిపి పొలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి, మాజీ మంత్రి పీతల సుజాత మాట్లాడుతూ టీడీపీ ఆవిర్భావం నుండి 40 ఏళ్ళు పైగా సేవలు అందిస్తూ..ఏపీఎస్ ఆర్టీసీ రీజనల్ చైర్మన్ గా 2 పర్యాయాలు , టిడిపి జిల్లా అధ్యక్షునిగా 3 పర్యాయాలు మున్సిపల్ వైస్ చైర్మన్ టిడిపి పార్టీకి పార్ధసారధి అందించిన సేవలు ఎనలేనివన్నారు. అనంతరం పేద మహిళలకు చీరలను పంపిణీ చేశారు. మా కుటుంబ సన్నిహిత పెద్దలు, మెంటే పార్ధ సారధి గారికి మన సిగ్మా న్యూస్ తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *