సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: విజయవాడలోని న్యూ రాజరాజేశ్వరి పేటలో ఇటీవల వందలాదిగా డయేరియా కేసులు పెరుగుతుంటంతో విజయవాడలోని మిగతా ప్రాంత ప్రజలలో తీవ్ర ఆందోళనకు గురి చేస్తుంది. ప్రస్తుతం తీవ్రమైన కడుపునొప్పి వాంతులు విరోచనాలుతో బాధపడుతున్న రోగుల సంఖ్య 300కు దాటింది. ఇప్పటికే సుమారు 150 మంది పలు ఆసుపత్రులలో చికిత్స తీసుకొంటున్నారు. డయేరియా వ్యాప్తికి గల కారణాలను ఆన్వేషించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వ వైద్య శాఖ అధికారులు పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు. అయితే, గత శనివారం రాత్రి మరో 20 మంది డయేరియా లక్షణాలతో ఆసుపత్రిలో జాయిన్ అయ్యా రు. వీరిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉండటంతో, వారిని వెంటనే ప్రభుత్వఆసుపత్రికి తరలించారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *