సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీలో ఇటీవల కురుస్తున్న వర్షాలు ఉల్లి రైతుల పరిస్థితిపై దారుణంగా ఉంది. రాయలసీమలోని . కర్నూలు, కడప జిల్లాల్లో ఉల్లి పంట బాగా పండినా, గిట్టుబాటు ధరలు లేకపోవడం రైతుల ఆందోళన అంతాఇంతాకాదు. ఈ రెండు జిల్లాల్లోని ఉల్లిపాయలను గోదావరి జిల్లాలలో అతిపెద్ద ఉల్లి మార్కెట్ పశ్చి మగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మార్కె ట్‌కి తరలించి హోల్ సేల్ గా అమ్ముతారు. అయితే తాడేపల్లిగూడెం మార్కెట్‌కి వచ్చిన ఉల్లిపాయలను డిమాండ్ లేక కొద్దిరోజులుగా ట్రేడర్లు కొనుగోలు చేయకపోవడంతో హోల్ సేల్ మార్కెట్లో కేజీ ఉల్లిపాయల ధరలు రూ. 6 కన్నా ఎక్కువ రేటుకు కొనడానికి ఆసక్తి చూపకపోవడంతో రైతులు దిగాలు పడిపోయారు. రాయలసీమ నుండి వచ్చిన ఉల్లి రైతులు ఒక్క ఎకరా లో ఉల్లి సాగుకు 50 వేలు పైగా ఖర్చు అవుతుంటే ఇక్కడ రవాణా ఖర్చులు కూడా రాని ధరలకు ఎలా అమ్ముకోవాలని వాపోతున్నారు. తమకు న్యాయం చెయ్యండని రైతులుప్రభుత్వ అధికారులుకు , విజ్ఞప్తి చేస్తున్నారు అయితే ఉల్లి రిటైల్ గా మాత్రం రవాణా ఖర్చులు తో కాస్త లాభాలు వేసుకొని మార్కెట్ లో 20-25 రూపాయలు అమ్మకాలు జరుగుతున్నాయి.
