సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్రప్రదేశ్ మెగా డీఎస్సీ 2025 ఫైనల్ లిస్ట్‌ను ప్రభుత్వం నేడు, సోమవారం విడుదల చేసింది. దీంతో 16,347 టీచర్ పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తయినట్లు అయింది. అందులో నేడు సోమవారం 15,941 మందికి అపాయింట్‌ కూడా ఇస్తున్నారు. ఈ సారి ఎస్సీ వర్గీకరణను సైతం పరిగణలోనికి తీసుకొన్నారు. జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంతోపాటు కలెక్టరేట్‌లో డీఎస్సీ తుది జాబితాను ప్రదర్శనకు పెట్టారు. అలాగే apdsc.apcfss.in వెబ్‌సైట్‌లో ఈ అభ్యర్థుల ఎంపికల జాబితా లభ్యమవు తుందని విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ప్రకటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *