సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: డి.ఎన్.ఆర్. ఇంజినీరింగ్ కళాశాలలో, సెప్టెంబర్ 15 న, భారత రత్న సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి సందర్భంగా ఇంజనీర్స్ డే వేడుకలను నేడు, సోమవారం కళాశాల అట్టహాసంగా నిర్వహించింది. కళాశాల కార్యదర్శి, గాదిరాజు సత్యనారాయణరాజు (బాబు) , ముఖ్య అతిథి, జాయింట్ కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి గారు కలిసి సర్ విశ్వేశ్వరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా వారివురు మాట్లాడుతూ.స్వర్గీయ విశ్వేశ్వరయ్య గారి సివిల్ ఇంజనీరింగ్ అద్భుత ఆవిష్కరణలు నేటి ఆధునిక యువతకు విద్యార్థులకు ఇప్పటికి స్ఫూర్తి దాయకమని, నేటి ఇంజనీరింగ్ రంగంలో జరుగుతున్న తాజా మార్పులు, సాంకేతిక ఆవిష్కరణల గురించి వివరించారు. కృత్రిమ మేధస్సు (AI), మెషిన్ లెర్నింగ్, బ్లాక్చెయిన్ వంటి టెక్నాలజీలు భవిష్యత్తును ఎలా మార్చ బోతున్నాయో విద్యార్థులకు ఉదాహరణలతో వివరించారు. అనంతరం, జేసీ టి. రాహుల్ కుమార్ రెడ్డి IAS ని కళాశాల యాజమాన్యం ఘనంగా సత్కరించింది. వివిధ టెక్నికల్ ఈవెంట్స్ లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. అలాగే నేడు, ఇంజనీరింగ్ డే సందర్భంగా భీమవరం లయన్స్ క్లబ్, ఆధ్వర్యంలో భీమవరం ఆర్ అండ్ బి డిపార్ట్మెంట్ లో విశేష సేవలందిస్తున్నఈఈ ఎ శ్రీనివాస్, డీఈలు పివి రామరాజు, సిహెచ్ టివి శివప్రసాద్ లను లయన్స్ క్లబ్ అధ్యక్షులు బొండా రాంబాబు, మరియు డా ఐశ్వర్య భూపతిరాజు ఇతర సభ్యులు సత్కరించారు. భీమవరంలో.. ఇంకా విష్ణు ఇంజనీరింగ్ కాలేజీలో కూడా ఘనంగా నిర్వహించారు.
