సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రేపు శుక్రవారం నుండి రానున్న నాలుగు రోజులు దక్షిణకోస్తా, రాయలసీమలో విస్తృతంగా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఉరుములతో కూడిన వర్షాలు పడేటప్పుడు చెట్ల కింద నిలబడరాదని సూచించారు. రేపు శుక్రవారం నుండి తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి,, కృష్ణా, రాయలసీమ జిల్లాలతో పాటు రాయలసీమలోని కొన్ని ప్రాంతాలలో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందని తెలిపారు.మిగతా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు.
