సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీలో మెడికల్ కాలేజీల విషయంలో ప్రభుత్వం తీసుకున్న పీపీపీ విధానాన్ని దొడ్డి ద్రోవలో ప్రేవేటీకరణ చేస్తున్నారని, పేద విద్యార్థులకు ద్రోహం చేస్తున్నారని నిరసిస్తూ వైసీపీ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనకు దిగింది. వైసీపీ చలో మెడికల్ కాలేజీల పిలుపుతో నేడు, శుక్రవారం రాజమండ్రిలో, సత్తెనపల్లి తో పాటు పలు ప్రాంతాలలో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది.ఏలూరులో పార్టీ కార్యాలయం నుండి కారుమూరి సునీల్ నేతృత్వంలో మెడికల్ కాలేజీ వైపుకు వెళుతున్న వైసీపీ కార్యకర్తలను నేతలను పోలీసులు అడ్డుకొన్నారు. వైసీపీ పిలుపు మేరకు రాజమండ్రి మెడికల్ కాలేజీకి వెళ్లేందుకు వైసీపీ శ్రేణులు మాజీ ఎంపీ భరత్ నేతృత్వంలో ప్రయత్నించారు వైసీపీ శ్రేణులు. మెడికల్ కాలేజీ దగ్గరకు వెళ్లడానికి వీల్లేదంటూ మార్గాని భరత్‌ను పోలీసులు అడ్డుకోవడం తో తీవ్ర వాదోపవాదాలు ఉద్రిక్తత నెలకొంది. కాలేజీలో పరీక్షలు జరుగుతున్నాయంటూ విద్యార్థులకు అసౌకర్యం కలిగిస్తున్నారని, పోలీసులు మార్గాని భరత్‌కు నోటీసులు ఇచ్చారు.సత్తెనపల్లిలో వైసీపీ శ్రేణులు ధర్నా చేశాయి. తాలుకా సెంటర్‌లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గుంటూరు నుంచి పిడిగురాళ్ళ మెడికల్ కాలేజ్ పరిశీలనకు వెళ్లున్న వైసీపీ శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఇక విశాఖ పట్నం, నర్సీపట్నం,మచిలీపట్టణం మదనపల్లి రాజాం పేట, ఆదోని, పులివెందుల మెడికల్ కాలేజీల వద్ద వైసీపీ శ్రేణులు విద్యార్థి సంఘాలతో కలసి పెద్ద ఎత్తున నిరసనలు ఆందోళనలు చేస్తున్నారు.
