సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, శుక్రవారం పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం రైల్వే స్టేషన్ ను విజయవాడ రైల్వే డీఆర్‌ఎం నరేంద్ర ఆనంద్‌ పాటిల్‌ పరిశీలించారు. అక్కడ రూ.30 కోట్లతో అమృత్‌ భారత్‌ పథకం కింద చేపడుతున్న పనుల్ని పరిశీలించారు. ఈ సందర్భంగా కీలక ప్రకటన చేశారు. నరసాపురము నుండి ( భీమవరం మీదుగా) దసరా, దీపావళి పండుగ రద్దీని గమనించి రెండు ప్రత్యేక రైళ్లను నడుపుతామని ప్రకటించారు. అలాగే ప్రస్తుతం చెన్నె-విజయవాడ మధ్య నడుస్తున్న వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు (20678)ను పొడిగించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ రైలును చెన్నై నుంచి విజయవాడ వరకు కాకుండా, ఇకపై నరసాపురం వరకు పొడిగిస్తామన్నారు. అయితే ఎప్పటి నుంచి ఈ రైలును పొడిగించేది వచ్చేవారంలో షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉందన్నారు. ( దీపావళి కానుకగా కావచ్చు) ఇటీవల కాలంలో విజయవాడ- విశాఖపట్నం మధ్య రైళ్లకు సంబంధించి రద్దీ పెరిగిందన్నారు ఆనంద్ పాటిల్. అందుకే ఈ మార్గంలో ప్రత్యామ్నాయంగా మరో రైల్వే లైన్ (మూడో లైను) నిర్మాణం చేపట్టాలని నిర్ణయించామని.. అంతేకాదు గోదావరి ప్రాంతంలో కీలకమైన కోటిపల్లి- నరసాపురం కొత్త రైల్వే లైను భూసేకరణపై ఫోకస్ పెట్టామని.. ఈ ప్రక్రియను త్వరగా పూర్తి చేస్తామన్నారు. 2027లో జరగబోయే గోదావరి పుష్కరాలను దృష్టిలో పెట్టుకుని.. కొవ్వూరు, నరసాపురం, రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్లు అభివృద్ధి చేస్తున్నామన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *