సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేటి సోమవారం, సెప్టెంబర్ 22వ తేదీ నుంచి కేంద్ర ప్రభుత్వం కొత్తగా తగ్గించిన జీఎస్టీ రేట్లు అమల్లోకి వచ్చాయి.కొత్త టీవీ, ఏసీలు, రిఫ్రిజరేటర్లు కొనేవారికి జీఎస్టీ రేట్లు తగ్గాయి. ఇకపై ఎయిర్ కండిషనర్లు, టెలివిజన్లు, రిఫ్రిజిరేటర్లు వంటి అనేక గృహోపకరణాలు ఇప్పుడు 18 శాతం జీఎస్టీ పరిధిలోకి వచ్చాయి. (గతంలో 28 శాతంగా ఉండేది). దీనితో ఈ ప్రొడక్టులపై 8 శాతం నుంచి 10 శాతం వరకు ఆదా చేసుకోవచ్చు. ఉదాహరణకు.. ఏసీలు, టీవీల ధరను రూ. 10వేల వరకు తగ్గించవచ్చు. ప్రధాన అప్లియన్సెస్‌తో పాటు, ఛార్జర్ల వంట మొబైల్ అప్లియన్సెస్‌పై కూడా జీఎస్టీ తగ్గింది. తద్వారా అవి చౌకగా ఉంటాయి. అదనంగా, మిక్సర్-గ్రైండర్లు, మైక్రోవేవ్‌లు, వాక్యూమ్ క్లీనర్లు, ఎయిర్ కూలర్ల వంటి ఇతర ఎలక్ట్రానిక్స్ ధరలు కూడా భారీగా తగ్గుతాయి. ఉదాహరణకు ఎయిర్ కండిషనర్, గతంలో, రూ.30వేలు ధర కలిగిన 1-టన్ ఏసీపై 28 శాతం జీఎస్టీ రూ.8,400 ఉండేది. కొత్త 18 శాతం రేటుతో పన్ను ఇప్పుడు రూ.5,400కు తగ్గింది. అంటే మీకు రూ.3వేలు ఆదా అవుతుంది. అలాగే 32 అంగుళాల కన్నా పెద్ద LCD, LED టీవీలపై జీఎస్టీ 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గింది. రూ. 20వేల విలువైన టీవీకి గతంలో జీఎస్టీ రూ. 5,600 ఉండగా ఇప్పుడు రూ. 3,600కు తగ్గింది. అంటే ఇక్కడ మీకు రూ. 2వేలు ఆదా అవుతుంది. దాంతో వినియోగదారులు కొనుగోళ్లపై భారీగా ఆదా చేసుకోవచ్చు.
