సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: చాల ఆలస్యం అయినప్పటికీ సామాన్య ప్రజల ను గుర్తించి వారికీ అవసరమైన వస్తువులపై జీఎస్టీ తగ్గిస్తూ.. కొత్త స్లాబుల అంశంపై ఏపీ మాజీ సీఎం జగన్ స్పందించారు. GST పునర్నిర్మాణం అనేది ఒక సరళమైన, నిష్పాక్షికమైన పన్ను వ్యవస్థ దిశగా ఒక విప్లవాత్మకమైన అడుగు అని జగన్ కొనియాడారు. ప్రతీ పౌరుడికి వస్తువులు, సేవలను మరింత సరళంగా అందుబాటులోకి తీసుకురావడానికి చేసిన ప్రయత్నమని అభినందించారు. ఈ ప్రక్రియ ప్రయోజనాలు చివరి వినియోగదారులకు చేరతాయని ఆశిస్తున్నానన్నారు. అక్కడక్కడా కొన్ని లోపాలు, కొన్ని ఫిర్యాదులు ఉండొచ్చు కానీ ఇది ఆర్థిక వ్యవస్థకు కావాల్సిన బూస్టప్ అందిస్తుందని పేర్కొంటూ మోడీ ప్రభుత్వాన్ని అభినందిస్తూ పోస్ట్ పెట్టడం సంచలనం రేపింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *