సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నిరుద్యోగులకు శుభవార్త! రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) 2025 సంవత్సరానికి సంబంధించి భారీగా రైల్వే ఉద్యోగాలకు తాజాగా మరో నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద దేశ వ్యాప్తంగా ఉన్న రైల్వే రీజియన్లలో మొత్తం 8,875 రైల్వే పోస్టులను భర్తీ చేయనుంది. పూర్తీ వివరణాత్మక సెంట్రలైజ్‌డ్‌ ఎంప్లాయిమెంట్‌ నోటిఫికేషన్‌ (CEN 2025) త్వరలో విడుదల చేయనుంది. నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ (NTPC) కింద మొత్తం ఖాళీలను భర్తీ చేయడానికి ఆమోదించినట్లు తన ప్రకటనలో పేర్కొంది. మొత్తం పోస్టుల్లో 5,817 పోస్టులు గ్రాడ్యుయేట్ లెవెల్‌, 3,058 పోస్టులు అండర్ గ్రాడ్యుయేట్‌ లెవెల్‌లో ఉన్నాయి. ఆర్‌ఆర్‌బీ ఎన్‌టీపీసీ రిక్రూట్‌మెంట్‌లోని గ్రాడ్యుయేట్ స్థాయి పోస్టుల్లో అత్యధికంగా గూడ్స్ రైలు మేనేజర్ పోస్టులు 3,423 వరకు ఉన్నాయి. జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్-కమ్-టైపిస్ట్ పోస్టులు 921, స్టేషన్ మాస్టర్ పోస్టులు 615, సీనియర్ క్లర్క్-కమ్-టైపిస్ట్ పోస్టులు 638, చీఫ్ కమర్షియల్-కమ్-టికెట్ సూపర్‌వైజర్ పోస్టులు 161, మెట్రో రైల్వేలో ట్రాఫిక్ అసిస్టెంట్ పోస్టులు 59 వరకు ఉన్నాయి. ఇక అండర్ గ్రాడ్యుయేట్ స్థాయి పోస్టుల్లో అత్యధికంగా కమర్షియల్-కమ్-టికెట్ క్లర్క్ పోస్టులు 2,424 వరకు ఉన్నాయి.ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన అర్హతలు, ఇతర వివరాలు RRBఅధికారిక వెబ్‌సైట్‌లో చెక్‌ చేసుకోవాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *