సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్లమ్మ అమ్మవారి దసరామహోత్సవాలు గతంలో దసరా వేడుకలకు ఒక మెట్టు పైనే అత్యంత మహా వైభవంగా జరుగుతున్నాయి. దేవాలయం ఆవరణలో ఎక్కడ చుసిన ఆధ్యాత్మిక శోభ తాండవిస్తుంది. ఈ రోజు శనివారం లలితా దేవి అలంకరణలో ఉన్న శ్రీ అమ్మవారిని దర్శించుకోవడానికి వేలాది భక్తులు దూర ప్రాంతాలు నుండి కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చారు.. సాక్షాత్తు ‘మహాశక్తి’ కొలువై ఉన్న దేవాలయం చుట్టూ 7 ప్రదక్షిణలు అంటే ‘సప్త లోకాలు ప్రదక్షిణ’ భాగ్యాన్ని.. కలిగించే.. సప్త ప్రాకార సేవను బ్రహ్మశ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ మరియు వేదపండితులు నిర్వహించారు. ఈ విశేష కార్యక్రమంలో..వందలాది సంఖ్యలో మహిళా భక్తులు 7 కావిళ్ళతో.. పసుపు కుంకుమ, అరటి గెలలు, పానకం, చీరలు, కొబ్బరి గెలలు, పూల బుట్టలు. మిఠాయిలతో , కోలాటాలు గానంతో ఆనందోత్సాహలతో ఊరేగింపుగా అమ్మవారిసన్నిధికి తీసుకొని రాగా ..ఇంత పెద్ద కార్యక్రమానికి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా దేవస్థానం సహాయ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ ఆధ్వర్యంలో సిబ్బంది,మునిసిపల్, పోలీస్ లు చక్కటి సహకారం అందించారు. ఈ దసరా ఉత్సావాలు 10 రోజులకు బదులు 11 రోజులు వచ్చిన కారణంగా.. 28 ఆదివారం శ్రీ అమ్మవారికి చండీ అలంకరణతో పాటుగా., ఉదయం 9 కి చండీ హోమం జరుగుతుంది అని..ఈనెల 29 సోమవారం మూల నక్షత్రం.. వచ్చిన కారణంగా,ఆరోజు ఉదయం 9 గంటలకు సరస్వతి పూజ జరుపబడును అని.. ఉచితంగా జరుపుతున్న ఈ పూజలో విద్యార్థులు పాల్గొని.. సరస్వతి దేవి అనుగ్రహం తో ఉన్నతి పొందాలని, ఈ కార్యక్రమం లో పాల్గొన్న విద్యార్థులకు చిరు కానుకగా.. మంచి పుస్తకాలు ఇవ్వనున్నామని దేవస్థానం అసిస్టెంట్ కమీషనర్.. బుద్ద మహాలక్ష్మి నగేష్ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *