సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మవారి దేవాలయంలో నేడు, ఆదివారం నిలువెత్తు బంగారు తల్లి శ్రీ అమ్మవారికి చండీ దేవి అలంకరణ తో భక్తులకు దర్శనం ఇస్తున్నారు. .నిజానికి దసరా వేడుకలలో చాల అరుదుగా సుమారు 10 సంవత్సరాల తరువాత మాత్రమే శ్రీ మావుళ్ళమ్మవారికి శ్రీచండీ దేవి అలంకరణ జరుగుతుంది ఈ అవతార నేపథ్యంలో నేటి ఉదయం 9 గంటల నుండి శ్రీచండీ దేవివేదపండితుల మంత్రోచ్ఛరణలతో నిర్వహించారు. విశేషంగా భక్తులు దంపతులు పాల్గొన్నారని దేవాలయ సహాయ కమిషనర్ బుద్ధా మహాలక్ష్మి నగేష్ తెలిపారు. రేపు 29వ తేదీ సోమవారం మూల నక్షత్రం.. వచ్చిన కారణంగా,ఉదయం 9 గంటలకు విద్యార్థులకు ఉచితంగా దేవాలయంలో సరస్వతి పూజ జరుపబడును. అలాగే ఈ పూజలో విద్యార్థులు పాల్గొనే .. శ్రీ సరస్వతి దేవి అనుగ్రహం తో ఉచిత పుస్తకాలు అందజేస్తారు. ఇక భీమవరం గునుపూడి పంచారామ క్షేత్రం శ్రీ సోమేశ్వర దేవస్థానంలో దసరా వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. నేడు, ఆదివారం శ్రీ పార్వతి అమ్మవారు ‘ శ్రీచండి’ అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. (ఫై తాజా ఫోటోలలో వీక్షించవచ్చు)
