సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల అసెంబ్లీ లో బాలకృష్ణ తనపై వ్యంగంగా చేసిన వ్యాఖ్యలు తనకు మనస్తాపం కలిగించాయని, గత జగన్ ప్రభుత్వం తనను గౌరవించిందని, తన చొరవ వల్ల సినీ పరిశ్రమకు మేలు జరిగిందని, తన వల్ల టికెట్స్ రేట్లు పెంచుకొని లాభాలు పొంది కూడా విమర్శించడం బాగోలేదని చిరంజీవి పంపిన లేఖాస్త్రంతో పాటు.. బాలయ్య అసెంబ్లీ లోనే చిరంజీవి అభిమాన సంఘాల నేత, మంత్రి దుర్గేష్ నుద్దేశించి ఇటీవల సినీ ఇండస్ట్రీ కి చెందిన ప్రభుత్వ ఆహ్వాన పత్రికలో నా పేరు 9వ స్థానంలో పెట్టించింది ఎవడు? నన్ను ఆ స్థాయిలో.. అని ఘాటుగా ప్రశ్నించడం దానికి మంత్రి మాట్లాడక పోవడం జరిగిన పరిణామాలు నేపథ్యంలో దేశవ్యాప్తంగా చిరు అభిమానులు ఆగ్రహంతో బాలకృష్ణ తో చిరంజీవికి క్షమాపణ చెప్పించాలని ఉద్యమిస్తున్న వేళా.. చిరంజీవి కోసం మెగా ఫ్యామిలీ నుండి ఇప్పటివరకు బహిరంగంగా ఒక్కరు కూడా స్వాందించక పోవడం గమనార్హం. ఇదిలాఉండగా ఇటీవల డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ వైరల్ ఫీవర్‌తో బాధపడుతు విశ్రాంతి తీసుకొంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయనను సీఎం చంద్రబాబు నేడు, ఆదివారం హైదరాబాద్‌లోని పవన్ నివాసానికి వెళ్లి పరామర్శించారు. ఆయనతో కొద్దీ సేపు మాట్లాడి ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు. పవన్‌కు చంద్రబాబు ధైర్యం చెప్పారు. వారి మధ్య చిరంజీవి కి సంబంధించి చర్చ జరిగిందో లేదో అధికారికంగా ప్రకటించవలసి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *