సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్టణంలో వాడవాడలా జరిగే దసరా వేడుకలలో స్థానిక త్యాగరాజ భవనంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి వారికి జరిగే శ్రీదేవి శరన్నవరాత్రుల మహోత్సవాలు రోజుకో తరహా పద్దతితో వినూత్నంగా ప్రతి ఏడాది ఎంతటి ఘనంగా చేస్తారో అందరికి తెలిసిందే.. ఈ వేడుకలలో గత ఆదివారం రాత్రి స్థానిక ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు పాల్గొని శ్రీవాసవీ కన్యక పరమేశ్వరీ దేవి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆర్య వైశ్య ప్రముఖులు ఆయనను శాలువాతో సత్కరించి శ్రీ అమ్మవారి ప్రసాదం అందజేశారు. తదుపరి ఆయన మాట్లాడుతూ.. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా జరుపుకునే పండుగ దసరా అని, దసరా పండుగ మనిషిని మంచిమార్గంలో నడిపించడానికి ఒక స్ఫూర్తిగా నిలుస్తూ ప్రతి ఇంటా సుఖసంతోషాలు వెల్లివిరియా లన్నారు. ఈ కార్యక్రమంలో వ్యాపార ప్రముఖులు ‘తటవర్తి బదిరి’ తో పాటు ఆర్యవైశ్య యువజన సంఘం సభ్యులు , ఆర్యవైశ్య వర్తక సంఘం సభ్యులు, కూటమి నాయకులు మహిళలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *