సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం వచ్చాక కీలక వైసీపీ నేతలు వరుసగా పలు కేసులలో అరెస్ట్ అయ్యి జైలు కు వెళ్లడం తదుపరి కోర్టులు ఇచ్చిన బెయిల్ ఫై దాదాపు అందరు బయటకు రావడం గమనార్హం. తాజగా లిక్కర్ స్కామ్ కేసులో నేడు, సోమవారం మధ్యాహ్నం కీలక పరిణామం చోటుచేసుకుంది. లిక్కర్ కేసులో అరెస్ట్ చేసి రాజమండ్రి సెంట్రల్ జైలులో ఏసీబీ కోర్టు ఆదేశాల మేరకు ఆధునిక సౌకర్యాలతో ఉన్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి బెయిల్ మంజూరు చేస్తూ.. ఏసీబీ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. రూ.2లక్షలతో రెండు ష్యూరిటీలు ఇవ్వాలని ఆదేశించింది. ప్రస్తుతం లిక్కర్ కేసులో ఏ-4 నిందితుడిగా ఎంపీ మిథున్ రెడ్డి ఉన్నారు. ప్రస్తుతం రాజమండ్రి జైల్లో ఉన్న మిథున్ రెడ్డి రేపు(మంగళవారం) జైలు నుంచి విడుదల కానున్నారు. ఇటీవల ఉప రాష్ట్ర పతి ఎన్నిక నేపథ్యంలో ఆయన మధ్యంతర బెయిల్ తో ఢిల్లీ వెళ్లి రావడం గమనార్హం. ఎంపీ మిదున్ రెడ్డి కి బెయిల్ రావడం తో వైసీపీ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
