సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: గత వారం నుండి వరుసగా భారీ నష్టాలనే చవిచూస్తున్న దేశీయ సూచీలకు తాజగా ఆర్బీఐ వడ్డీ రేట్లను యధాతధం గా 5.5 శాతం ఉంచుతున్నట్లు ప్రకటించి జోష్ పెంచింది. దీనితో బ్యాంకింగ్ సెక్టార్‌లో కొనుగోళ్లు సూచీలను ముందుకు దూసుకొనిపోతున్నాయి. షరా మాములుగా నేటి బుధవారం ఉదయం 100 పాయింట్ల సెన్సెక్స్ నష్టాలతో మొదలైన సూచీలు ఆ తర్వాత లాభాల బాట పట్టాయి. ప్రస్తుతం సెన్సెక్స్, నిఫ్టీ లాభాల్లో కదలాడుతున్నాయి. గత మంగళవారం ముగింపు (80, 267)తో పోల్చుకుంటే నేటి బుధవారం ఆర్బీఐ వడ్డీ రేట్ల ప్రకటన తర్వాత కనిష్టం నుంచి ఏకంగా 400 పాయింట్లకు పైగా లాభపడింది. ప్రస్తుతం ఉదయం 11 గంటల సమయంలో సెన్సెక్స్ 292 పాయింట్ల లాభంతో 80, 560 వద్ద కొనసాగుతోంది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే సాగుతోంది. ప్రస్తుతానికి 76 పాయింట్ల లాభంతో 24,687 వద్ద కొనసాగుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *