సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఒక ప్రక్క మరోసారి పశ్చిమ ఆసియా ఇరాన్ అమెరికా యుద్ధం భాగంగా.. ఇరాన్ మరియు దాని మిత్ర హైతీ గ్రూపులు గల్ఫ్ లోని అమెరికా మిత్ర దేశాలపై తీవ్ర మిసైల్ దాడులు చెయ్యడం సౌదీ అరేబియా కూడా యుద్ధంలోకి దిగటంతో దానిపై హైటీలు చేస్తున్న విద్వంస దాడులు ప్రపంచాన్ని ఉలిక్కి పడేలా చేస్తుంది.చమురు బావులు తగలాడిపోతున్నాయి. చమురుధరలు భారీగా పెరిగిపోతున్నాయి. అందుకే అమెరికా లోని ట్రంప్ ప్రభుతం కీలక నిర్ణయం తీసుకోండి. దీనితో రష్యా స్నేహితులు అయిన భారత్, చైనాలపై చమురు కొనుగోలు పన్నులు సడలిస్తుంది. ఉక్రెయిన్‌తో జరుగుతున్న యుద్ధాన్ని ముగించేలా రష్యాపై ఒత్తిడి పెంచేందుకు తీసుకొచ్చిన బిల్లులో అమెరికా మార్పులు చేర్పులు చేసింది. రష్యా నుంచి చమురు కొనుగోలు చేసే భారత్, చైనా వంటి దేశాలపై ప్రతిపాదిత సుంకాల గరిష్ఠ పరిమితిని 500 శాతం నుంచి 100 శాతానికి తగ్గించింది.
