సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో చిన్న తిరుమల గా తెలుగునాట ప్రసిద్ధి పొందిన ‘ద్వారకా తిరుమల శేషాచలంపై స్వయం భువుడు.. చినవెంకన్న ఆశ్వయుజ మాస దివ్య బ్రహ్మోత్సవాలు ఈ వచ్చే 3వ తేదీ గురువారం నుంచి ప్రారంభమై 9 తేదీ వరకు వైఖానస ఆగమయుక్తంగా జరగనున్నాయి. గురువారం ఉదయం స్వామి, అమ్మవార్లను పెండ్లికుమారుడు, పెండ్లికు మార్తెలుగా చేస్తారు. 5వ తేదీ రాత్రి 7 గంటలకు ఎదుర్కోలు ఉత్సవం, 6వ తేదీ రాత్రి 8 గంటలకు శ్రీవారి కల్యాణోత్సవం నిర్వహిస్తారు. 7వ తేదీ రాత్రి 8 గంటలకు రఽథోత్సవం, 8వ తేదీ న శ్రీచక్ర వార్యుత్సవం, ధ్వజావరోహణ జరుగుంతుంది. 9న ఉదయం 9గంటలకు చూర్ణోత్సవం, వసంతోత్సవం, రాత్రి జరిగే ద్వాదశకోవెల ప్రదక్షిణలు, శ్రీపుష్పయాగోత్సవంతో ఉత్సవాలు ముగుస్తాయి. ఈ వేడుకల నేపథ్యంలో నిత్యార్జిత కల్యాణాలు, ఆర్జిత సేవలు రద్దు చేసారు.
