సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: మరోసారి పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడిందని ఇది ఉత్తర వాయవ్య దిశగా కదులుతూ తీవ్ర వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని దీని ప్రభావం ఎక్కువ ఉత్తరాంద్రఫై ఉంటుందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఇది ప్రస్తుతానికి విశాఖపట్నానికి 400 కిలోమీటర్లు, ఒడిశాలోని గోపాల్‌పూర్‌‌కి 420 కిలోమీటర్లు, పారాదీప్‌కి 500 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైందని తెలుస్తుంది. ఎల్లుండి శుక్రవారం తెల్లవారుజామున అంటే.. అక్టోబర్ 3వ తేదీన ఇది గోపాల్‌పూర్- పారాదీప్ మధ్య తీరం దాటే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. .కోస్తా తీరం వెంబడి గంటకు 40 నుంచి 60 కి.మీ. వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందన్నారు. సముద్రంలో వేటకు వెళ్లొద్దంటూ ఈ సందర్భంగా మత్స్యకారులను హెచ్చరించారు. అల్పపీడనం ప్రభావంతో భీమవరం లో కూడా నేటి బుధవారం సాయంత్రం నుండి ఆకాశం మేఘ వృతం అయ్యి చిరు జల్లులు పడుతున్నాయ్. రాత్రికి భారీ వర్షం గా మారే అవకాశం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *