సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తాజగా..ఏపీకి చెందిన టీడీపీ, వైసీపీ ఎంపీలకు కేంద్రంలో కీలక పదవులు దక్కాయి. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా పార్లమెంటు స్థాయీ సంఘాలను పునర్ వ్యవస్థీకరించారు. కేంద్రంలో వివిధ ప్రభుత్వశాఖల వ్యవహారాలను ఈ సంఘాలు పరిశీలిస్తాయి. జాతీయ సైన్స్ అండ్ టెక్నాలజీ, పర్యావరణ, అడవులు, వాతావరణ మార్పులు సంబందించిన శాఖలో : భీమవరం కు చెందిన పాకా వెంకట సత్యనారాయణ (బీజేపీ ఎంపీ, రాజ్యసభ), ఈయనతో పాటు పరిమళ్ నత్వానీ ( వైసీపీ ఎంపీ, రాజ్యసభ).. తెలంగాణ నుంచి వంశీకృష్ణ గడ్డం (కాంగ్రెస్ ఎంపీ, పెద్దపల్లి), కేఆర్ సురేష్‌రెడ్డి (బీఆర్ఎస్ ఎంపీ, రాజ్యసభ) కమిటీ సభ్యులుగా ఉంటారు.
