సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల బంగాళాఖాతంలో వరుస అల్పపీడనాలు, వాయుగుండాల ప్రభావం పశ్చిమ గోదావరి జిల్లాపై పాక్షికంగా ఉండటంతో ప్రజలు పండుగల వేళా ఊపిరి తీసుకొన్నారు. అయితే ఉత్తరాంద్రలో మాత్రం భారీ వర్షాలు పెనుగాలులతో భారీ నష్టం కలిగింది. నిన్నటి వాయుగుండం ప్రభావంతో ఉమ్మడి విజయనగరం జిల్లాలోపూర్తిగా, కోనసీమ లోని కొన్ని ప్రాంతాలలో రైతులు తీవ్రం గా నష్టపోయారు. బొబ్బిలి, సాలూరు,భోగాపురం మండలంలోని పలు గ్రామాల్లో ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి. వేలాది ఎకరాల పొలాల్లో వారం రోజులలో కోతకు సిద్ధంగా ఉన్న అరటి తోటలు నేలమట్టమయ్యాయి. లక్షల రూపాయు పెట్టుబడితో పండిన అరటి గెలలు నేలపాలయ్యాయి. ప్రతి ఏటా ఇక్కడి రైతులకు అరటి సాగుపై ఎకరాకి యాభై నుంచి లక్ష రూపాయలు లాభం వచ్చేది. కానీ, ఇప్పుడు పూర్తిగా పంట నేలపాలైంది.రాష్ట్ర ప్రభుత్వం తమను ఆదుకోవాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *