సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: గతంలో ‘కాంతారా’ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో 350 కోట్లు కొల్లగొట్టిన రిషబ్ శెట్టి హీరోగా దర్శకుడుగా లేటెస్ట్ మూవీ ‘కాంతార: చాప్టర్ 1’ సంచలన విజయం సాధిస్తూ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. ఈ సినిమాకు ముఖ్యంగా కన్నడ, హిందీ వెర్షన్లకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. తెలుగునాట కూడా మంచి కలెక్షన్స్ సాధిస్తుంది. ఈ సినిమా కేవలం 6 రోజుల్లోనే రూ. 427.5 కోట్లు గ్రాస్ కలెక్షన్ (Kantara Chapter 1) తాజాగా మేకర్స్ విడుదల చేసిన అఫీషియల్ అప్‌డేట్ ప్రకారం, ‘కాంతార: చాప్టర్ 1’ ఇప్పటి వరకు మొత్తం రూ. 427.5 కోట్లు గ్రాస్ కలెక్షన్ సాధించింది. అయితే ఇందులో తెలుగు వెర్షన్ వాటా 6 రోజులకు 55 కోట్లు ఉండటం గమనార్హం. ఆరు రోజుల్లోనే ఈ స్థాయిలో కలెక్షన్లు రాబట్టడం విశేషం. ఇప్పుడు సినిమా రూ. 500 కోట్ల కలెక్షన్స్ దిశగా అడుగులు వేస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *