సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: మాజీ సీఎం జగన్ గత, సాయంత్రం భీమవరంలో నరసాపురం వైసీపీ మాజీ ఎమ్మెల్యే ప్రసాదరాజు కుమారుడి వివాహ వేడుకకు హాజరు అయ్యారు. గత సాయంత్రం వర్షపు చినుకుల మధ్య హెలిప్యాడ్ నుండి మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత, వైఎస్ జగన్మోహన్ రెడ్డి కి దారి పొడవున వైసీపీ శ్రేణులు వస్తుండటంతో కాన్వాయి కి ఇబ్బంది లేకుండా పోలీసులు ఎక్కడికక్కడ వారిని బారికేట్స్ అవతలకు నెట్టి దారికి ఇబ్బంది లేకుండా చేసారు. పెదమిరం లోని రాధా కృష్ణ కల్యాణ మండపం లో వదువరులను జగన్ ఆశీర్వదించారు. వాతావరణం బాగోకపోయిన ఆకాశం మేఘ వృత్తం అయ్యిన నేపథ్యంలో వేగంగా జగన్ హెలిప్యాడ్ కు చేరుకొని తాడేపల్లి కి తిరుగుపయనమయ్యారు. ( గత ఆగస్ట్ నెల 13న వివాహ వేడుకకు జగన్ భీమవరం వచ్చినప్పుడు కూడా ఇదే రీతిన వర్షం రావడం ఆయన స్థానిక నేతలతో ఎటువంటి మర్యాదపూర్వక సమావేశం లేకుండానే హెలికాఫ్టర్ లో తిరిగి వెళ్లడం గమనార్హం) తదుపరి భీమవరంలో 2 గంటల పాటు పిడుగులతో కూడిన భారీ వర్షం కురిసింది. గత రాత్రి జరిగిన పెళ్లి కార్యక్రమానికి వదువరులను ఆసిర్వదించడానికి రాజకీయాలకు అతీతంగా రాష్ట్ర వ్యాప్త ప్రముఖులు మండలి చైర్మెన్ మోషేను రాజు, మాజీ మంత్రి రోజా, పలువులు వైసీపీ ఎమ్మెల్సీ లు జిల్లా వ్యాప్తంగా కీలక వైసీపీ నేతలు పాల్గొన్నారు.
