సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: విశాఖను ఆర్హిక రాజధానిగా మార్చేస్తున్నాం.. రాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీకరణ తో హైదరాబాద్ కే కాదు ఐటి కి గ్లోబెల్ రాజధానిగా విశాఖ ను మార్చేస్తా.. ఈ మాటలు గతంలో మాజీ సీఎం జగన్ నోటా బాగా విన్న మాటలే.. అయితే ఆ మాటలు తాజాగా..ఈసారి మంత్రి నారా లోకేష్ నుండి వచ్చాయి.. తాజాగా విశాఖలో సిఫీ ఏఐ డేటా సెంటర్‌కు మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా లోకేష్ నేడు, ఆదివారం మాట్లాడుతూ.. రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ బులెట్ ట్రైన్ వేగంతో పరుగులు తీస్తోంది. రాష్ట్రంలో గ్రేటర్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్ గా విశాఖ ఆవిర్భవిస్తుంది.. రాష్ట్రంలో మా హయాంలో ఐటి ఇతర పారిశ్రామిక సంస్థల స్థాపనకు 120బిలియన్ డాలర్ల పెట్టుబడులు సాధిస్తుంటే 50శాతం విశాఖకే తరలి వస్తున్నాయి.. విశాఖపట్నంలో 5 లక్షల ఐటీ ఉద్యో గాలు కల్పన మా లక్ష్యం అని పేర్కొన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీకరణ విధానంతో పని చేస్తున్నాం .. ఇక్కడ అభివృద్ధికి కేబినెట్ నాకు బ్లాంక్ చెక్ లాంటి అవకాశం ఇచ్చింది.. హైదరాబాద్ IT అభివృద్ధికి 30 ఏళ్లు పడితే ఆ స్థాయికి రావడానికి విశాఖకు కేవలం 10 ఏళ్లలో చేరుకుంటుంది అని ధీమా వ్యక్తం చేశారు. విశాఖ అభివృద్ధి కి కేంద్ర ప్రభుత్వం ఇచ్చి న నిధులతోపాటు రాష్ట్ర ప్రభుత్వం అదనంగా మరో రూ. 3 వేల కోట్లు ఇచ్చింది అని లోకేష్ అన్నారు. మన రాష్ట్రంలో ‘విశాఖపట్నం ఎకనామిక్ పవర్ హౌస్’ గా మారుతుంది.. అయితే ఇక్కడ రాజప్రసాదాలు మాత్రం కట్టం అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *