సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరంలోని గునుపూడి లోని పవిత్ర పంచారామ క్షేత్రం శ్రీ సోమేశ్వర స్వామి దేవస్థానంలోని అన్నపూర్ణ అమ్మవారికి 19 న్నర కేజీల వెండితో తయారు చేసిన మకర తోరణాన్ని నేడు, ఆదివారం దేవస్థానంకు దాతలు అందించారు. సుమారు రూ 30 లక్షల విలువ కలిగిన వెండి మకర తోరణాన్ని స్థానిక ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు చేతుల మీదుగా దేవస్థానంకు అందించారు .ఆయన దాతలను అభినందించారు. ఆలయ ధర్మ కర్తల చైర్మన్ చింతలపాటి బంగార్రాజు మాట్లాడుతూ.. శ్రీ అన్నపూర్ణ అమ్మవారికి వెండి మకర తోరణాన్ని పట్టణానికి చెందిన బోండా వెంకట సుబ్రహ్మణ్య (బుజ్జి బాబు) అందించారన్నారు. ముందుగా ఆలయ ప్రాంగణంలో మకర తోరణంకు ఆలయ అర్చకులు పూజలను నిర్వహించి అన్నపూర్ణ అమ్మవారికి అలంకరణ చేశారు( పైచిత్రంలో చూడవచ్చు). కార్యక్రమంలో ఈవో రామకృష్ణంరాజు, దేవస్థాన పాలకవర్గ సభ్యులు యార్లగడ్డ రమేష్, బ్రహ్మజ్యోసుల సత్య ప్రసాద్, బండి రమణ, పాట్నూరి శ్యామ్ కుమార్, పెద్దింటి జ్యోతిర్మయి, కొప్పర్తి విజయ్ కుమార్, సాయి విజయలక్ష్మి, పాల రామకృష్ణ, పడమటి లీల, బొత్స కృష్ణవేణి, కందుకూరి సోమేశ్వర రావు, ఆలయ అర్చకులు, భక్తులు పాల్గొన్నారు. తదుపరి గునుపూడి నాచువారి సెంటర్ లో శ్రీ కనకదుర్గ దేవి దేవాలయం వద్ద దసరా ముగింపుగా స్థానిక ఒంటెద్దు బండ్ల సంఘం ఆధ్వర్యంలో జరిగిన భక్తుల అన్నసమారాధన ను ఎమ్మెల్యే అంజిబాబు మెంటే పార్ధ సారధి ప్రారంభించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *