సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: సైలెంట్ గా సూపర్ హిట్స్ ఇచ్చే యువ హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram). ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఐదేళ్లలోనే పది చిత్రాలు పూర్తి చేశాడు. గతేడాది దీపావళి కి ‘క’ సూపర్ హిట్ తో 50 కోట్ల క్లబ్ లో చేరాడు. తదుపరి ‘దిల్రూబా’తో పరాజయం ఎదుర్కొన్నాడు. ఇప్పుడు మరల ‘కే సెంటిమెంట్ రిపీట్ చేస్తూ ‘కె-ర్యాంప్’ అంటూ నేడు,శనివారం ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. యుక్తి తరేజా కథానాయికగా జైన్స్ నాని (Jains Nani) దర్శకత్వంలో రాజేష్ దండా-శివ బొమ్మకు నిర్మించిన ఈ చిత్రం కధ విషయానికి వస్తే.. కుమార్ అబ్బవరం (కిరణ్ అబ్బవరం) పారిశ్రామిక వేత్త కృష్ణ (సాయికుమార్) గారాల బిడ్డ. పెద్దగా చదువు అబ్బట్లేదని, అల్లరి చిల్లరిగా తిరుగుతున్నాడని కేరళలోని కాలేజ్ లో జాయిన్ చేస్తాడు తండ్రి. అక్కడ తొలి చూపులోనే మెర్సీ జాన్ (యుక్తి తరేజా)తో ప్రేమలో పడతాడు కుమార్. ఆమెకు జీవితకాలం తోడుంటానని వరమిచ్చేస్తాడు. అసలు మెర్సీ ఎవరు?ఆమెకు ఎలాంటి మానసిక జబ్బు ఉంది అని చూడకుండా ప్రేమలో దిగిన కుమార్ కు దిమ్మ తిరిగిపోతుంది. మరి కుమార్ తన వరాన్ని నిలబెట్టుకొన్నాడా? అనేది ఈ సినిమా కథ. ఇక సినిమా ఎలా ఉందంటే.. ఒక్క ముక్కలో చెప్పాలంటే లాజిక్కులు లేకుండా నవ్వుకోవడానికి తీసిన సినిమా ఇది. కొన్ని పాత్రల చిత్రీకరణలో లోపాలు కూడా ఉన్నాయి. హీరోయిన్ మెంటల్ సమస్యకు పరిష్కారం ఎలా అని హీరో ని అడిగితే ‘చాట్ జిపిటికి‘ నా సమస్య చెప్పాను. అది నాకు ఇలా చేయి అని సజెస్ట్ చేసింది అనే డైలాగ్ బాగా పేలింది. ఫస్టాఫ్ అంతా ఫన్ ప్రేమాయణం, హీరోయిన్ సమస్యతో సోసోగా సాగింది. సెకండాఫ్ నుంచి అదిరిపోయింది. సీనియర్ కామిడి హీరో నరేశ్, నిజ జీవిత ఘటనలపై చిత్రీకరించిన కామిడి ట్రాక్ థియేటర్లలో నవ్వులు తో దద్దరిలింది.కామెడీ తో పాటు క్లైమాక్స్ లో ఎమోషన్స్ ఉండటంతో థియేటర్ నుంచి బయటకు వచ్చే ఆడియన్ ఫీల్ తో బయటకు వస్తాడు. ఇక హీరోయిన్, హీరో తండ్రికి సంబంధించిన సీన్స్ భావోద్వేగాన్ని కలిగిస్తాయి. ఇక అడల్ట్ జోక్స్ చాల ఉన్నాయి. కిరణ్ సబ్బవరంతో పాటు అందరు బాగా నటించారు. దర్శకుడు కామిడి ని చాలాబాగా హ్యాండిల్ చేసాడు. మొత్తానికి k సెంటిమెంట్ ఈ దీపావళికి వర్కట్ అయ్యింది.
