సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆమె యాచకురాలు.. ఆలయాల వద్దకు వచ్చే భక్తులను ఎందరినో యాచన చేసి కడుపు కట్టుకొని దాచుకొన్న డబ్బు.. కానీ ఆమె ఔదార్యం చుస్తే భగవంతుడైన ఆశ్చర్యపొక మానడు. ఆలయాల వద్ద భిక్షాటన ద్వారా వచ్చిన సొమ్ములో కొంత అదే దేవాలయాల అభివృద్ధికి కానుకగా ఇచ్చేసేంత దానగుణం కూడా ఉంది. తునికి చెందిన యాచకురాలు నర్సియమ్మ. పవిత్ర కార్తీకమాసం సందర్భంగా కాకినాడ జిల్లా తుని గాంధీ సత్రం ప్రాంగణంలోని శ్రీ అన్నపూర్ణ విశాలాక్షి సమేత విశ్వేశ్వరస్వామి ఆలయానికి గత శనివారం రూ.50వేల కానుకగా ఇవ్వడం జరిగింది.ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు ఆమెను సత్కరించారు. ఇది కాదు అసలు విస్మయం కలిగించే విషయం .. ఆమె గతంలో ఏకంగా శ్రీశైలం భ్రమరాంబిక అమ్మవారికి ‘బంగారు కళ్లు’ సమర్పించారు. ధారాలమ్మ ఆలయానికి రూ.లక్ష, శివాలయానికి రూ.50వేలు ఇవ్వడంతో పాటు ఆలయాలకు కూడా రూ.10వేలు, రూ.20వేల చొప్పున విరాళాలు అందించారు. యాచన చేసిన డబ్బునే మరల భగవంతునికి అందిస్తూ ఆమె ఫై చెయ్యి సాదిస్తునట్లు లేదు..
