సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ తీవ్ర స్థాయిలో తన “X” వేదికగా సీఎం చంద్రబాబు, రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC), అధికార యంత్రాంగం తీరుపై ధ్వజమెత్తారు. మున్సిపల్, కార్పొరేషన్, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలతో పాటు తాజాగా జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లోనూ భారీ ఎత్తున రిగ్గింగ్ జరిగిందని ఆయన ఆరోపించారు. ఎన్నికల్లో గెలిచిన వారిని సైతం ఓడిపోయినట్టుగా అధికారులు ప్రకటించారని, కస్టపడి గెలిచిన ఫలితాలు కూడా మార్చేశారని రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదని “నారా స్వామ్యం”మే నడుస్తుందని ఎద్దేవ చేశారు. ఎన్నికల సందర్భంగా వైసీపీ నేతలపై టీడీపీ నేతలు చేసిన అరాచకాలు అంటూ నామినేషన్స్ , పోలింగ్ ఘట్టాలలో జరిగిన కొన్ని వీడియోలను కూడా షేర్ చేశారు. అలాగే రిటర్నింగ్ అధికారులు, పోలీసులు, అధికార పార్టీ నాయకులు కుమ్మక్కై ఎన్నికల ఫలితాలను శాసించారని జగన్ మండి పడ్డారు.
