సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం గునుపూడిలో వేంచేసి యున్న పంచారామక్షేత్రం శ్రీ సోమేశ్వర జనార్థన స్వామి వార్ల దేవస్థానం నందు కార్తీక మాసం నేపథ్యంలో నేడు, గురువారం వర్షంలో సైతం విశేషంగా భక్తులు స్వామివారిని దర్శించుకొంటున్నారు.ఉదయం మహన్యాస పూర్వక ఏకాదశ వార రుద్రాభిషేకం లక్ష పత్రి పూజ లక్ష కుంకుమార్చన రుద్ర హోమం శాంతి కళ్యాణం కార్యక్రమాలు వైభవంగా జరిగాయి. దేవాలయంలో కార్తీక మాస నేపథ్యంలో రోజు జరిగే భక్తులకు అన్నసమారాధన కు తమ భాగ్యంగా ప్రతి ఏడాది లానే మాజీ ప్రభుత్వ విప్ మరియు భీమవరం మాజీ శాసన సభ్యులు గ్రంధి శ్రీనివాసు కుటుంబం తరపున నేడు, వారి శ్రీమతి మరియు కుమారుడు గ్రంధి రవి తేజ చేతుల మీదగా శ్రీ సోమేశ్వర జనార్ధన వార్ల నిత్యన్నదానం ట్రస్ట్ నకు లక్షలాది విలువైన 32 క్వింటా లు సోనా బియ్యం అందించారని ఈ కార్యక్రమమునకు గ్రామస్తులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారని కార్యనిర్వహణాధికారి, డి కృష్ణంరాజు ఒక ప్రకటనలో తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *