సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం చెందిన ఒక యువతిని రైలులో సిటు ఇస్తానంటూ టిటి అధికారి అసభ్యంగా వేధించాడని భీమవరం కేసు నమోదు అయ్యింది. కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనలో యువతి చెప్పిన వివరాలు ప్రకారం..భీమవరం చెందిన ఆ యువతి నెల్లూరులోని ఓ కాలేజీలో బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ కోర్సు మొదటి సంవత్సరం చదువుతోంది. కాలేజీకి వెళ్లేందుకని అక్టోబర్ 8వ తేదీ ‘నర్సాపురం – ధర్మవరం ఎక్స్‌ప్రెస్’ రైలులో రిజర్వేషన్ చేసుకుంది. అయితే వెయిటింగ్ లిస్ట్ 31 వచ్చింది. దీంతో టీటీని బతిమాలుకుని.. సీటు సంపాదించుకుని నెల్లూరు వెళ్దామంటూ నర్సాపురం నుండి ధర్మవరం రైలు S7 బోగిలోకి ఎక్కేసింది. అక్కడ . సీటు ఇస్తానంటూ తన టిటి సీట్లో కూర్చోబెట్టి ప్రయాణికులు అటువైపు రాకపోవడంతో ఆ యువతి ప్రెవేటు భాగాలు తాకుతూ అసభ్యంగా ప్రవర్తించిన టీటీ నుండి రైలులో ప్రయాణికుల సహకారంతో తపించుకొని భీమవరం రాగానే కేసు నమోదు చేసింది. బాధిత యువతి ఫిర్యాదుతో టీటీకి విజయవాడ రైల్వే అధికారులు మెమో జారీ చేశారు. అలాగే భీమవరం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. యువతులు ప్రయాణాలలో ఎంత జాగ్రత్తగా ఉండాలో ఈ ఘటన చెపుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *