సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల బంగారం ధరలు కాస్త దిగి వస్తున్నప్పటికీ ఈ ఏడాది ఇప్పటివరకు బంగారం కంటే వెండి ధరలు బాగా పెరిగాయి.కిలో వెండి ప్రస్తుతం 1లక్ష 80 వేలకు అటు ఇటుగా దోబూచులాడుతోంది. అంటే దాదాపు 70 శాతం వరకుపెరిగింది. అయితే బంగారం తాకట్టు పెడితే బ్యాంకులలో తక్కువ వడ్డీకే దాదాపు 1 రూపాయి లోపే వడ్డీ కి ఋణం తీసుకొనే సదుపాయం ఉంది. లోన్ కూడా బంగారం విలువను బట్టి.. దాని విలువలో 70-80 శాతం వరకు బ్యాంకులు ఇస్తాయి. అయితే తాజా శుభవార్త ఏమిటంటే.. ఇకపై బంగారు ఆభరణాల మాదిరిగా.. సిల్వర్ జువెల్లరీ, కాయిన్స్ తాకట్టు పెట్టి కూడా బ్యాంకులలో లోన్ తీసుకునే సౌకర్యం రాబోతుంది. దీనికి సంబంధించి ఆర్బీఐ కీలక ప్రకటన జారీ చేసింది. కొత్త మార్గదర్శకాలు కూడా ప్రకటించింది. 2026, ఏప్రిల్ 1 నుంచి.. దీనిని తప్పనిసరిగా అమలు చేయాలని వాణిజ్య బ్యాంకులు, బ్యాంకింగేంతర ఆర్థిక సంస్థలకు స్పష్టం చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *