సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల కాలంలో బంగారం ధరలు భారీగా దూసుకొని పోయాయి. 10 గ్రాముల ధరలు దాదాపుగా రూ.2 లక్షల వరకు వెళ్తుందని మార్కెట్ నిపుణులు హడావిడి చేసారు. అయితే అకస్మాత్తుగా బంగారం ధరలు రికార్డు స్థాయిలో పడిపోతున్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రికార్డు స్థాయిలో రూ.1.32 లక్షలకు పైగా ఉండగా, ఇప్పుడు రూ.1.18 లక్షలకు పడిపోయింది. ఇటీవల బంగారం ధరలు రూ.13,000 కంటే ఎక్కువ తగ్గాయి. ఇక వెండి కూడా భారీగానే తగ్గుతోంది. వెండి ధరలు రికార్డు స్థాయిలో కిలోకు రూ.1.80 లక్షల నుంచి కిలోకు రూ.1.41 లక్షలకు పడిపోయాయి. రికార్డు స్థాయిలో రూ.39 వేల వరకు తగ్గింది. తాజగా నేటి బుధవారం ఉదయం తెలుగు రాష్ట్రాలలో హైదరాబాద్, విజయవాడలో ధరలు స్వల్పంగా పెరిగి ఎలా ఉన్నాయంటే? 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై 760 పెరిగి.. రూ.1,21,580గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం1 ధర రూ.1,11,450గా ఉంది.

  1. ↩︎

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *