సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమగోదావరి జిల్లా పెంటపాడు మండలం అలంపురం గ్రామంలో హైవే ప్రక్కనగల ఉచిత వైద్య సేవలు అందిస్తున్న శ్రీ వెంకటరమణ సేవ చారిటబుల్ ట్రస్ట్ చైర్మెన్, డాక్టర్ కొలనువాడ పెద్ద కృష్ణంరాజు ‘సిగ్మా న్యూస్’ కు ఒక ప్రకటనలో ఈ విధంగా తెలియజేసారు. శ్రీ వెంకటరమణ సేవాసదనము నిర్మాణాలు చేపడుతున్నామని మొదటిది కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానము,  రెండవది వంద పడకల ఉచిత హాస్పిటల్,  మూడవది వృద్ధుల కొరకు ఆనంద నిలయము, 4వది  ఉచిత స్వయం ఉపాధి కేంద్రము ( ఫ్రీ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్) వీటి నిర్మాణము కొరకు ప్రథమంగా హైందవ శంఖారావం లో భాగంగా కని విని ఎరుగని రీతిలో  250 గోవులు, 18 అశ్వాలు, 2 వృషభాలు, 1 గజేంద్రుడు  మరియు స్వామీజీలు, పీఠాధిపతులుచే  హోమాలు అభిషేకాలు, పారాయణలు  మరియు సుమారు వెయ్యి మంది హరే శ్రీనివాస కోలాట భజనలతో, నృత్యాలతో  అంగరంగ వైభవంగా వచ్చే ఏడాది ది : 08 – 02 – 2026 తారీకున శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్న జీయర్ స్వామి వారి ఆధ్వర్యంలో జరుపుతున్నామని తెలిపారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *