సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ పెద్దల ఆధ్వర్యంలో నకిలీ మద్యం తయారీ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. అయితే ఈ లిక్కర్ తయారీ వ్యవహారంలో వైసీపీ నేతలు కూడా ఉన్నారని కూటమి సర్కార్ ‘సిట్’ దర్యాప్తులో ప్రకటించింది. ఈ కేసులో తాజాగా నేడు, వైసీపీ మాజీ మంత్రి జోగి రమేష్ ను అరెస్ట్ చేసారు. అయితే జోగి రమేష్ అరెస్టుపై మాజీ సీఎం జగన్, ఎక్స్ వేదికగా స్వాందిస్తూ ..‘ మీ నకిలీ మద్యం ఫ్యాక్టరీలు బయటపడి అడ్డంగా దొరికిపోయారని, దీని నుంచి తప్పించుకోవడానికి నిస్సిగ్గుగా కుట్రలకు పాల్పడుతూ మా పార్టీకి చెందిన జోగి రమేష్‌ను అన్యాయంగా అరెస్టు చేశారని’ ఇది ముమ్మాటికీ అక్రమ అరెస్టు అని, ఆయన అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. గత 18 నెలలుగా మీ ప్రభుత్వం నడుస్తోందని, పట్టుబడ్డ నకిలీ మద్యం మీ హయాం లో జరిగిందని , పట్టుబడ్డవారిలో టీడీపీ నుంచి పోటీచేసిన ఎమ్మెల్యే అభ్యర్థి మొదలు మీకు-మీ కొడుకు -మంత్రులు- టీడీపీ ఎమ్మెల్యే లతో అత్యంత సన్ని హిత సంబంధాలు ఉన్నవారేనని ఆరోపించారు. గత శనివారం కాశీబుగ్గ ఆలయంలో జరిగిన ఘటనకు ప్రభుత్వ వైఫల్యాల నుంచి దృష్టి మళ్లించడానికి, మోంథా తుపాను కారణంగా కుదేలైన రైతు గోడును పక్క దోవ పట్టించడానికి ఈ అక్రమ అరెస్టుకు పాల్పడ్డారని పేర్కొన్నారు. నకిలీ మద్యం వ్యవహారంపై మీ చేతులలో ఉండే సిట్ తో కాదు కేంద్రం ఆధీనంలోని సీబీఐ విచారణ జరిపించాలంటూ జోగి రమేష్ హైకోర్టులో పిటిషన్ వేసిన, మరుసటి రోజు జోగి అరెస్టుకు దిగారంటే, మీరు ఎంతగా భయపడుతున్నారో అర్థం అవుతుందన్నా రు. మీ మాఫియా వ్యవహారాల మీద మీరే విచారణ చేయించడం హాస్యాస్పదం కాదా?అని జగన్ ప్రశ్నించారు.
