సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం మండలం కొమరాడ- గోర్లమూడి విశాల సహకార పరపతి సంఘం త్రిసభ్య కమిటీ చైర్మన్ గా రాట్నాల సత్యనారాయణ (భీమవరం రూరల్ మండల బిజెపి అధ్యక్షులు), డైరెక్టర్లుగా మల్లుల పరమేశ్వరరావు, వర్రె గణేష్ లు నేడు, ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు. ముఖ్య అతిధిగా హాజరు అయినా కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ మాట్లాడుతూ.. పదవి కేవలం బాధ్యత మాత్రమే చూడకుండా తమ ప్రాంత రైతుల, గ్రామాల అభివృద్ధికి సేవ చేసే గొప్ప అవకాశంగా మీరు భావించాలన్నారు. బిజెపిలో చాలాకాలం నుండి పని చేస్తున్న రాట్నాల సత్యనారాయణకు విశాల సహకార పరపతి సంఘం చైర్మన్ గా పదవి ఇవ్వటానికి తాను అడిగిన వెంటనే సహకరించిన జనసేన ,టిడిపి నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో నర్సాపురం పార్లమెంట్ పరిధిలో మూడు పార్టీల మధ్య మంచి సమన్వయం ఉందని సీఎం చంద్రబాబు సైతం మెచ్చుకున్నారన్నారు. రైతన్నలకు అన్ని రకాల ఆర్థిక, వ్యవసాయ సేవలు అందించే శక్తిపీఠాలుగా మారాలన్నారు. ఈ కార్యక్రమములో భీమవరం ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు మాట్లాడుతూ.. రైతుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని, సకాలంలో రుణాలు మంజూరు చేయాలని, తన వంతు సహకారం అందిస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి పొలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు కొటికలపూడి గోవిందరావు, టిడిపి జిల్లా అధ్యక్షులు, ఏపీఐఐసీ చైర్మన్ మంతెన రామరాజు, బిజెపి జిల్లా అధ్యక్షురాలు అయినంపూడి శ్రీదేవి , డీసీఎంఎస్ ఛైర్మన్ చాగంటి మురళీకృష్ణ, బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శిలు కలిదిండి వినోద్ వర్మ, తోట గంగరాజు, టిడిపి రాష్ట్ర కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావు, ఎఎంసీ వైస్ చైర్మన్ బండి రమేష్, టౌన్ హాల్ అధ్యక్షులు కోళ్ల రామచంద్రరావు, కూటమి నేతలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *