సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరంలో నేటి సోమవారం ఉదయం భీమవరం MPDO కార్యాలయం లో జరిగిన భీమవరం మండల స్థాయి రివ్యూ మీటింగ్ లో స్థానిక జనసేన ఎమ్మెల్యే అంజిబాబు తో పాటు రాష్ట్ర శాసన మండలి చైర్మన్, కొయ్యే మోషేను రాజు పాల్గొని ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులు తీసుకుంటున్న చర్యల గురించి వివిధ శాఖల అధికారులను ప్రశ్నించారు. కొందరు అధికారులు సరైన వివరాలను ప్రజాప్రతినిధులకు అందచేయకపోతే ప్రజలకు మెరుగైన సేవలు ఎలా? అందుతాయని మందలించారు, తరువాత జరిగే రివ్యూ మీటింగ్ నకు పూర్తి వివరాలతో రాకపోతే తగు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. భీమవరం నియోజకవర్గానికి సంబంధించి రహదారులకు అత్యవసర నిధులుగా రూ 17 కోట్ల మంజూరు చేశారని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) అన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక బీజేపీ రాజ్యసభ సభ్యులు పాకా సత్యనారాయణ వైసీపీ MLC కవురు శ్రీనివాస్ , వైసీపీ MPP పేరిచర్ల నరసింహ రాజు వైసీపీ ZPTC కాండ్రేగుల నరసింహ రావు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. కీలక రాజకీయ పార్టీల ప్రజా ప్రతినిధులు ఒకే వేదికను పంచుకోవడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి ఆదర్శం
