సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలుగు సినీ పరిశ్రమలో ప్రముఖ సీనియర్ హీరో, విలన్, నటుడు, నిర్మాత,మాజీ రాజ్యసభ సభ్యుడు, విద్యావేత్త, పద్మశ్రీ అవార్డు గ్రహీత మోహన్ బాబు (Mohan Babu) చిత్రసీమలోకి అడుగుపెట్టి యాభై సంవత్సరాలు పూర్తయ్యింది. ఈ సందర్భంగా ఓ గ్రాండ్ ఈవెంట్ ను మోహన్ బాబు తనయుడు మంచు విష్ణు ప్లాన్ చేశారు. నవంబర్ 22న ‘ఎం.బి. 50: ఎ పెరల్ వైట్ ట్రిబ్యూట్’ (MB50) పేరుతో ఓ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు. ఇదొక చారిత్రక ఘట్టముగా అందరి మనస్సులలో గుర్తుండిపోయేలా ఈ వేడుక నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ ఇటీవల కన్నప్ప తో హిట్ అందుకొన్న విష్ణు తో పాటు కుటుంబ వివాదాల నేపథ్యంలో వీరికి దూరంగా ఉన్న మనోజ్ కూడా మిరాయి తో పాన్ ఇండియా హిట్ కొట్టారు. మనోజ్ తో పాటు సినీ పరిశ్రమలో, రాజకీయా పెద్దలు కూడా వేడుకకు హాజరు అయ్యే అవకాశాలు ఉన్నాయి. సుమారు 530 చిత్రాలులో నటించిన మోహన్ బాబు ప్రస్తుతం 74 ఏళ్ళ వయస్సులో కూడా యువతను మించిన దూకుడు, పటుత్వం, ఏమాత్రం తగ్గలేదు.. నాని హీరోగా తెరకెక్కుతున్న ‘ది పారడైజ్’లో ప్రతినాయకుడిగా నటిస్తున్నాడు. అలాగే సూపర్ స్టార్ కృష్ణ మనమడు తొలిసారి హీరోగా.. దర్శకుడు అజయ్ భూపతి సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *