సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలుగు రాష్ట్రాల్లో కార్తీకపౌర్ణమిని అంతటా ఘనంగా జరుపుకుంటున్నారు. నేటి,బుధవారం తెల్లవారు జామునుండి ఏపీలోని అన్ని శివాలయాలలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు, దీపారాధనలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఉసిరి చెట్టు కింద దీపారాధన చేసి, అరటి డొప్పలలో దీపాలు వెలిగించి నీటిలో వదులుతున్నారు. భక్తులు దానధర్మాలు, నదీ స్నానాలు చేస్తూ తమ జీవితాలలో వెలుగులు నింపాలని పరమ శివుని వేడుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఏపీలో స్కంద పురాణప్రాశస్యం ఉన్న పంచారామాలలో (భీమవరం పాలకొల్లు,అమరావతి, ద్రాక్షారామం, సామర్లకోటలలో) అయితే భక్తుల తాకిడి మరింత ఎక్కువగా ఉంది. సాక్షత్తు చంద్రుడి ప్రతిష్ట అయిన భీమవరం గునుపూడి లోని శ్రీ సోమేశ్వరుడు అయితే మరో ఎత్తు.. ప్రపంచంలో ఏ లింగాకారానికి లేని విధంగా అమావాస్య కు గోధుమ వర్ణం లోను పౌర్ణమికి పూర్తీ శ్వేత వర్ణంతో దర్శనమిస్తున్న శ్రీ సోమేశ్వరుడు ను దర్శించుకోవడానికి ఇతర రాష్ట్రాల నుండి కూడా భక్తులు నేడు తరలి రావడంతో వేలాది భక్తులతో ఆలయం ప్రాంగణం కిక్కిరిసిపోయింది. త్రోపులాటలు కు ఆస్కారం లేకుండా ధర్మకర్తల మండలి , పోలీసులు , స్వచ్చంద శివ భక్తులు భక్తులకు తగిన ఏర్పాట్లు చేసి పరిస్థితి పర్యవేక్షిస్తున్నారు. మంచినీరు మజ్జిగ , ప్రసాదాలు పంపిణి చేస్తున్నారు. సోమగుండం వద్ద మహిళలు దీపారాధనలు జరుగుతున్నాయి, ఆలయం అంతా ఈ రోజు అసలైన కార్తీక ఆధ్యాత్మిక శోభ తాండవిస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *