సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీ రాజధాని అమరావతిని ఏ ఐ హబ్ గా మారుస్తామని అమరావతి లోగోలో A I ఉంటుందని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సాక్షత్తు సీఎం చంద్రబాబు ప్రకటించారు. కానీ విశాఖ ను ఆర్ధిక రాజధానిగా, A Iహబ్ గా మారుస్తామని ఆ దిశగా అడుగులు వేస్తున్న మంత్రి లోకేష్ ప్రకటించడం అందరు కొత్త మార్పును గమనిస్తున్నారు. తాజగా నేడు, సోమవారం తెలుగుదేశం మంత్రులతో విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, ఆర్టీజీఎస్ శాఖల మంత్రి నారా లోకేష్ ( Nara Lokesh) ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో బ్రేక్‌ఫాస్ట్ సమావేశం నిర్వహించారు. సీనియర్ ఎమ్మెల్యేలు, నేతలతో తొలిసారి గెలిచిన ఎమ్మెల్యేలకు అవగాహన కల్పించాలని అన్నారు, ఈ నెల 14, 15తేదీల్లో విశాఖ వేదికగా జరిగే పెట్టుబడుల భాగస్వామ్య సదస్సును కలిసి కట్టుగా విజయవంతం చెయ్యాలన్నారు. ఈ సదస్సు ద్వారా రాష్ట్రానికి దాదాపు 10 లక్షల కోట్ల పెట్టుబడులు రానున్నాయని తెలిపారు. వీటి ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షలాది మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు.రేపు ఎంఎస్ఎమ్ఈ పార్కుల కార్యక్రమంలో మంత్రులంతా విధిగా పాల్గొనాలని స్పష్టం చేశారు. తమ తమ జిల్లాల పరిధిలో సంస్థలు గ్రౌండ్ అయ్యేలా మంత్రులు, ఇన్‌ఛార్జి మంత్రులు బాధ్యత తీసుకోవాలని సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *